అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో ‘ సినిమా ఈ రోజు విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ మార్క్ పంచులతో, డైలాగ్ లతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా పై ప్రశంశలు కురిపించాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. సోషల్ మీడియా వేదికగా బన్నీకి చరణ్ విషెస్ తెలిపాడు. ‘ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ అల్లు అర్జున్, త్రివిక్రమ్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న. అల వైకుంఠపురంలో సినిమాను అందరు థియటర్స్ కు వెళ్లి చూడాలని’ చరణ్ కోరారు.
చరణ్ విషెస్ తో మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గత కొంత కాలంగా బన్నీకి మెగా ఫ్యామిలీకి దూరం పెరుగుతుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అందు లోను మహేష్ ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ చిరంజీవి వెళ్లడంతో ఈ పుకారులకు మరింత బలం చేకూరింది. ఇక అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మెగా ఫ్యాన్స్ అని మెన్షన్ చేయకుండా నా ఫ్యాన్స్, నా ఆర్మీ అంటూ ప్రస్తావించడంతో అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా రామ్ చరణ్ బన్నీకి విషెస్ చెప్పడంతో ఫ్యాన్స్ కు ఊరట లభించింది. బన్నీ మెగా ఫ్యామిలీకి దూరం కాలేదని కొంత క్లారిటీ రావడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.
Mega Powerstar #RamCharan wishes Stylish Star @alluarjun & #Trivikram's #AlaVaikunthapurramuloo pic.twitter.com/hCcNFe59y9
— Vamsi Kaka (@vamsikaka) January 12, 2020