HomeTelugu Big Storiesషాద్‌నగర్ ఘటనపై.. ఉపాసన సంచలన వీడియో

షాద్‌నగర్ ఘటనపై.. ఉపాసన సంచలన వీడియో

10 27మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఆమె ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా చాలా యాక్టివ్‌గా స్పందిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. దేశమంతా మాట్లాడుకునేలా చేసిన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం హత్య ఘటనతో దేశమంతా మనవైపు చూస్తుంది. ఈ షాద్‌నగర్ లైంగికదాడిపై అంతా సోసల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పుడు ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది.

పిల్లలందరిని కామాంధుల భారిన పడకుండా కాపాడటం ఎలా అనే ఒక అంశంపై ఒక వీడియోని సిద్ధం చేసి.. తన ఛానెల్లో విడుదల చేసింది. ప్రజల బాగుకోసమే తనవంతు సాయంగా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది మెగా కోడలు. ఇందులో మన సమాజంలో పిల్లలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల నుంచి వాళ్లను వాళ్లు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చాలా విషయాలు పొందుపరిచింది ఉపాసన. మనం ఉంటున్న ఈ సమాజంలోనే అమ్మాయిలపై నీచంగా వ్యవహరించే క్రూరమృగాలు కూడా ఉంటున్నాయని తెలుసుకుని అంతా సిగ్గుతో చచ్చిపోతున్నారు.

ఇలాంటి ఘటనలపై తనవంతు సాయంగా ఉపాసన చేసిన పనితో అంతా ఆమెకు ఫిదా అయిపోతున్నారు. దానికితోడు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను.. చిట్కాలను కూడా ఈ మధ్యే ఓ వీడియో రూపంలో యూట్యూబ్‌లో విడుదల చేసింది. గతంలో ఫిట్ నెస్ వీడియోలు విడుదల చేసిన ఉపాసన ఇప్పుడు సమాజానికి పనికొచ్చే వీడియోలు తీసుకొస్తుంది. మొత్తానికి ఈమె చేస్తున్న కొన్ని వీడియోలు.. చూపిస్తున్న సామాజిక బాధ్యతపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu