ఈ రోజు మెగాజంట రామ్ చరణ్- ఉపాసన పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. 2012 వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జోడీ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రామ్ చరణ్ వరస సినిమాలతో హీరోగా, నిర్మాతగా రాణిస్తూ తన సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూసుకుంటునే.. సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ దుసుకుపోతుంది ఉపాసన.
సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన అభిమానుతో టచ్‌లో ఉంటుంది. నేటి సమాజంలో మహిళల ప్రాధాన్యత, హక్కులు తదితర అంశాలపై స్పందించడమే గాక, రామ్ చరణ్ సినిమా సంగతులు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తుంటుంది ఈ మెగా కోడలు. ఈ జంటను చూసి వీరి జంటను చూసి మెగా అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు క్లాప్‌బోర్డ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతుంది.