మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 9వ పెళ్లిరోజు (జూన్ 14) నేడు. 2012 లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన రోజున తన భర్త రామ్ చరణ్‌కి చీర్స్ చెబుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే పోస్ట్ పెట్టింది ఉపాసన. వారి పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో దిగిన ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ తన జర్నీ గురించి ఆసక్తికరంగా సందేశమిచ్చింది.
ఈ రిలేషన్‌షిప్‌ని ఇంత బలంగా, ప్రకాశవంతంగా ఉంచుకున్నందుకు మన ఇద్దరికీ చీర్స్ అంటూ కిక్కిచ్చే కామెంట్‌తో చెర్రీకి స్వీట్ విషెస్ చెప్పింది ఉపాసన. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే చాలా సందర్భాల్లో ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం తెలియపర్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రామ్ చరణ్ RRR మూవీతో బిజీగా ఉన్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. కీరవాణి బాణీలు కడుతుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ భారీ మూవీ కోసం అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు… తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
View this post on Instagram