HomeTelugu Big Storiesశర్వానంద్‌ ఎంగేజ్మెంట్‌లో రామ్ చరణ్ ఉపాసనల సందడి

శర్వానంద్‌ ఎంగేజ్మెంట్‌లో రామ్ చరణ్ ఉపాసనల సందడి

Ram Charan Upasana in Sharw
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ కూడా ఒకడు. గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో శర్వానంద్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు శర్వా తన ఎంగేజ్మెంట్ ని హైదరాబాద్ లో కుటుంబీకులు మరియు స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు. మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు రక్షిత రెడ్డిని హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.

శర్వానంద్‌ స్నేహితుడు.. టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన భార్య ఉసాసనతో కలిసి ఈ వేడుకకు హాజరైయ్యారు. కాబోయే వధూవరిలిద్దరితో కలిసి ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రెటీలు, ఫ్యాన్స్‌.. శర్వానంద్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu