మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇప్పటికే తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటాడు. ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇచ్చినా.. కరోనా ఎఫెక్ట్ తగ్గకపోవడంతో.. ఇంకో నాలుగైదు నెలలు వరకు రామ్ చరణ్ ఇంటికే పరిమితం కానున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో ఆ బాధను వెల్లగక్కాడు. మనసు మాత్రం వర్కౌట్స్ చేయమని చెప్పినా.. బుద్ధి మాత్రం వద్దని చెబుతుంది. అయినా ఫిట్నెస్గా ఉండాలంటే ఆ మాత్రం కష్టపడాలిగా అంటూ తన వర్కౌట్స్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.కాగా ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.