మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఇటీవల ‘స్పైడర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమాపై భారీ ఖర్చు చేసిన నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆ నష్టాల నుండి నుండి బయటపడాలంటే మరో స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ అందుకోక తప్పదు.
ఈ క్రమంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్.. రామ్ చరణ్ ను కలవగా చరణ్ సినిమా చేస్తానని మాటిచ్చాడట. అప్పటివరకు
కమర్షియల్ మాస్ సినిమాలు చేసిన చరణ్ తో ‘దృవ’ అనే డిఫరెంట్ సినిమా చేసి ఘన విజయాన్ని అందించాడు ఎన్వీ ప్రసాద్. దీంతో ఆయన బ్యానర్ లో మరో సినిమా చేస్తానని చెప్పాడట.
ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. మరి ఎన్వీ ప్రసాద్ కు ఎప్పుడు డేట్లు ఇస్తాడో చూడాలి!