ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన ఈ బ్యూటీ నటించింది. యంగ్ హీరోలతో సైతం జత కడుతోంది. కానీ టాలీవుడ్ లో రోజురోజుకి కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువవుతుండడంతో రకుల్ స్పీడ్ కు బ్రేకులు పడుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. త్వరలో బోయపాటి శ్రీనుతో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకుంటారనే మాటలు వినిపించాయి. దాదాపుగా ఆమెను ఫైనల్ చేశారని అన్నారు.
కానీ రామ్ చరణ్ మరో మలయాళ హీరోయిన్ పై కన్నేశాడు. తాజాగా ఆక్సీజన్ సినిమాతో పాటు పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అజ్ఞాతవాసి సినిమాలో కూడా అను ఇమ్మాన్యూయేల్ నటించింది. ఇక అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందుతున్న నా పేరు సూర్య సినిమాలో కూడా అను ఇమ్మాన్యూయేల్ నటిస్తుంది. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో నటిస్తున్న ఈమెకి తాజాగా బోయపాటి, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తుందని తెలుస్తుంది.