HomeTelugu Trendingలవ్‌స్టోరీ తో రామ్‌చరణ్‌

లవ్‌స్టోరీ తో రామ్‌చరణ్‌

10 6
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో బీజీగా ఉన్నాడు‌. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంతవరకు తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం ‘మళ్లీ రావా’ – ‘జెర్సీ’ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ స్క్రిప్ట్ చరణ్ కు వినిపించినట్టు తెలుస్తుంది. అయితే ఆరంజ్ సినిమా తరువాత చరణ్ లవ్ స్టోరీస్ జోలికి పోవడం లేదు. కమర్షియల్ సినిమాలే బెటర్ అని చరణ్ అనుకుంటున్నాడు. ఈ టైంలో ఆరంజ్ లాంటి బ్యూటీఫుల్ లవ్ స్టోరీని గౌతమ్ తిన్ననూరి చరణ్ కు వినిపించాడని తెలుస్తుంది.

ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఉత్తరాది అమ్మాయి.. దక్షిణాది అబ్బాయి మధ్య ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని గౌతమ్ వినిపించారట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి యూనిక్ గా అనిపించి లాక్ చేసినట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్నది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu