ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వాయిదా తరువాత కొన్ని రోజుల క్రితమే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ పై సీన్స్ షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ఇంటర్వెల్ కు సంబంధించిన దృశ్యాలను షూట్ చేస్తున్నారు. మరోవైపు సమ్మర్ వెకేషన్ కోసం టాంజానియా వెళ్లిన రామ్ చరణ్ నిన్ననే తిరిగి ఇండియాకు వచ్చారు.
వచ్చిన వెంటనే ఈ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ రామ్ చరణ్ కొంతకాలం రెస్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది.