Ram Charan Upcoming Movies:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ వరుసగా సినిమాలతో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ చాలామంది డైరెక్టర్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బోలెడు ప్యాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
గేమ్ చేంజర్:
శంకర్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ ఈ మధ్యనే దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిసల్ట్ ఏమవుతుందో అని మెగా అభిమానులు కంగారుపడుతున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది.
RC16:
స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చి బాబు సనా ఈ మధ్యన మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తో సినిమా తీసే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సినిమా రంగస్థలం కి మించి ఉంటుంది అని చెర్రీ స్వయంగా చెప్పడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. స్పోర్ట్స్ డ్రామా గా పల్లెటూరి పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుంది.
RC17:
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే రంగస్థలం అనే సినిమా విడుదలైంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బుచ్చిబాబు తో సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. రంగస్థలం కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
RC18:
కె జీ ఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ హీరోగా కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో సినిమా చేసిన ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ 18వ సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు ఉన్న రామ్ చరణ్ ప్రభాస్ తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేసే విషయంలో ముందున్నారని చెప్పుకోవచ్చు.