HomeTelugu Big Storiesనిర్మాతగా మారాకే రియల్ మెగాస్టార్‌ను చూశాను: చరణ్‌

నిర్మాతగా మారాకే రియల్ మెగాస్టార్‌ను చూశాను: చరణ్‌

11 2మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 2 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నది. ఈనెల 15 వ తేదీ నుంచి ప్రమోషన్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటె, రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు.

మెగాస్టార్ కు ఎదురుగ నిలబడి.. గడ్డాన్ని సరిచేస్తున్న ఫోటో అది. ఆ ఫొటోకు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. నిర్మాతగా మారిన తరువాతే రియల్ మెగాస్టార్‌ను చూశాను. సినిమా కోసం మెగాస్టార్ అంకిత భావంతో ఎలా పనిచేస్తారో చూశాను అని చెప్పి అన్నారు రామ్ చరణ్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పొషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu