స్టార్ హీరోయిన్ అనుష్కా- యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లాంగ్ బ్రేక్ తరువాత అనుష్కా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. జాతిరత్నాలు సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేసిన నవీన్ పొలిశెట్టి ఇందులో స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు.
ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు పాన్ ఇండియా హీరో రామ్‌చరణ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా టీజర్ చాలా బాగుంది. చాలా రీఫ్రెషింగ్‌గా ఉంది. టీం మెంబర్స్ కు గుడ్ లక్.. అని ట్వీట్ చేశారు. రాంచరణ్ ట్వీట్‌తో సినిమాపై బజ్ మరింత పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నోనోనో లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. అనుష్క తల్లి పాత్రలో జయసుధ నటిస్తోంది.
Loved the #MissShettyMrPolishetty teaser, looks refreshing 😃 Good luck to the entire team. https://t.co/3MGYB8920T@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @UV_Creations
— Ram Charan (@AlwaysRamCharan) May 4, 2023
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు