HomeTelugu Big Stories'భీమ్లా నాయక్‌' ట్రైలర్‌పై రామ్‌చరణ్‌ ప్రశంసలు

‘భీమ్లా నాయక్‌’ ట్రైలర్‌పై రామ్‌చరణ్‌ ప్రశంసలు

Ram charan review on bheeml

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల ప్రధాన పాత్రలో నటించిన భారీ మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్‌’. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్‌, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్‌’ సినిమా ట్రైలర్​ను ఫిబ్రవరి 21న విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్​ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా బాబాయ్​ మూవీ ట్రైలర్​పై అబ్బాయి మెగా పవర్‌ స్టార్‌ రామ్​ చరణ్ రివ్యూ ఇచ్చాడు.

‘#భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ !! పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ ‘పవర్ ఫుల్’ నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం. #BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ఆల్ ది బెస్ట్!!’ అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నేడు ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం భీమ్లా నాయక్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించనున్నారు.

కాజల్‌ సీమంతం ఫొటోలు వైరల్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu