HomeTelugu Trendingరిపబ్లిక్ ఫస్ట్ లుక్ ఇచ్చిన రామ్‌చరణ్

రిపబ్లిక్ ఫస్ట్ లుక్ ఇచ్చిన రామ్‌చరణ్

Ramcharan Republic first loమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రిపబ్లిక్ అనే సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సాయిధరమ్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న సాయిధరమ్ తేజ్ తాజాగా రిపబ్లిక్ అంటూ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu