మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శివరాత్రి సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి గుళ్లకు కూడా తిరిగేస్తున్నాడు. తాజాగా దోమకొండ శివుడి గుడికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసారు. ఆ గుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దాన్ని పునర్మించింది ఉపాసన కుటుంబ సభ్యులే. కాకతీయుల కాలంలో అంటే.. సుమారు 800 ఏళ్ల క్రితం ఈ గుడిని నిర్మించారు. ఆ తర్వాత దోమకొండ కోటను కూడా తమ కుటుంబ సభ్యులే 400 ఏళ్ల క్రితం నిర్మించారని పోస్ట్ చేసింది ఉపాసన. దాంతో అక్కడ భక్తులు కూడా ఈ గుడిని నిత్యం దర్శించుకుంటూనే ఉంటారు. ఇక ప్రతీ సంవత్సరం శివరాత్రి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు.
ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఇక ఈ సారి రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేకంగా వెళ్లి సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ శివయ్యకు పూజలు నిర్వహించారు. చరణ్ పంచె కట్టుకుని వెళ్లాడు.. ఆయన శివలింగాన్ని శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు.
Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. 🙏🏼 OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam 🙏🏼 restore ancient temples pic.twitter.com/sme3oPMo7P
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019
The #Domakonda Fort Shivalayam is over 800 years old from the Kakatiya Period.
Our forefathers built the Domakonda Fort around the Shivalayam 400 years ago.
OM NAMAH SHIVAYA #MAHASHIVRATRI #ramcharan pic.twitter.com/HhrvEzKyAt
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019