మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ హీరోయిన్ కియారా అద్వాణీ కోసం ముంబయికి వెళ్లారు. ఈ భామ బుధవారం 27వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి ఆమె చెర్రీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చరణ్ ముంబయికి వెళ్లినప్పుడు తీసిన ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో ఆయన న్యూలుక్‌లో కనిపించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం మీసాలు పెంచుకుని, కొత్తగా కనిపించారు. ఈ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చెర్రీ లుక్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చరణ్, కియారా జంటగా ‘వినయ విధేయ రామ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆయన కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీ సతీమణి ‘సీత’ పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా కంటే ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో జక్కన్న తెలిపారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం