HomeTelugu Trendingసాహో డైరెక్టర్‌తో రామ్‌ చరణ్ సినిమా‌!

సాహో డైరెక్టర్‌తో రామ్‌ చరణ్ సినిమా‌!

Ram charan movie with sujee
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ సాహో డైరెక్టర్‌ సుజీత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్‌ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. సాహో మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, వివిధ భాషల్లో విడుదలైంది. అప్పట్లో అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రభాస్ అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశ పరిచింది.

దాంతో అప్పటి నుంచి సుజీత్ మరో సినిమా చేయలేకపోయాడు. ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరి నిమిషంలో చరణ్ మనసు మార్చుకున్నాడు. అయితే ఓ మంచి కథను తయారు చేసుకుని వస్తే తాను చేస్తానని ఆ సమయంలో సుజీత్ కి చరణ్ మాట ఇచ్చాడట. తాజాగా సుజీత్ కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu