మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లుక్‌లో చరణ్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కైరా అద్వానీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. తెలుగు హీరో ఆర్యన్ రాజేష్‌లు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.