Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి పాన్ ఇండియా రెంజ్‌లో గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత గ్లోబల్ స్టార్ పేరుతో దూసుకుపోతున్నారు. రాజమౌళితో సినిమా చేస్తే పారితోషికం భారీగా రావడంతోపాటు జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
అవార్డులు కూడా కొల్లగొట్టొచ్చు అని అంటారు. అయితే రాజమౌళి రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశారు. రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరువాత ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ను అందుకున్నారు.
ప్రస్తుతం ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరువాత చరణ్ నటిస్తున్న ప్రతిష్టత్మక మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఆర్సీ16 చిత్రం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈక్రమంలో చరణ్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రచార చిత్రాలు, వాణిజ్య ప్రకటనల్లో కూడా పాల్గొంటున్న చెర్రీ ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునేవారు.
తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాకు రూ.95 నుంచి రూ.100 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఈ రెమ్యునరేషన్ కు అదనంగా మరో 30 శాతాన్ని జోడించి తీసుకుంటున్నారని తెలుస్తోంది.
అంటే 125 నుండి 130 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేయబడింది. రజనీకాంత్, ప్రభాస్, తలపతి విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజాలతో పాటు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల లీగ్‌లో చేరడం, రామ్ చరణ్ సక్సెస్‌కు నిదర్శనం.