యాక్షన్ సినిమా… లవ్ స్టోరీస్.. ఫ్యామిలీ డ్రామా.. ఫాంటసీ.. ఎక్స్‌పెరిమెంట్ ఏదైనా .. జోనర్ ఎలాంటిదైనా
కావొచ్చు.. సక్సెస్ గీటురాయిగా .. సత్తా చాటుకోవడమే ధ్యేయంగా.. సినిమాలు చేస్తూ వరుస
విజయాలతో దూసుకుపోతున్న హీరో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. ‘ధృవ’ సినిమాతో మారోసారి
తన సత్తా ఏంటో లోకానికి చాటాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్‌లోని
మేకోవర్‌కి ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు. విమర్శకుల ప్రశంసల జల్లులు కురిపించారు.
బాక్సాఫీస్ వద్ద ‘ధృవ’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
స్టార్ హీరోలు సేఫ్ జోన్‌లోనే ఉంటారు.. అనేది పాత మాట. ప్రయోగాత్మక పంథాలోనూ వెళతారు
అన్నది నేటి మాట.. అని నిరూపించిన స్టారాధిస్టార్ రామ్‌చరణ్. ధృవ సంచలన విజయం
సాధించడానికి అసలు కారణం స్క్రిప్టులోని వైవిధ్యమే. ఓ రీమేక్ సినిమానే అయినా చరణ్
బాడీ లాంగ్వేజ్, గ్రేస్, హైపంచ్ ఎనర్జీని ఎలివేట్ చేస్తూ కథాంశాన్ని మలిచిన తీరు, సన్నివేశాల్ని
తీర్చుదిద్దిన వైనం కట్టిపడేసింది. అందుకే `ధృవ` సెన్సేషన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు
ఓవర్సీస్‌లోనూ కంటిన్యూ అవుతోంది. చరణ్ ధృవ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన సంగతి
తెలిసిందే. అక్కడ ప్రీమియర్ షోని అభిమానులతో తిలకించారు. ప్రమోషన్ యాక్టివిటీస్‌లో
చరణ్ యాక్టివ్‌గా పాల్గొని అభిమానులతో సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. మిలియన్
డాలర్ క్లబ్‌ని దాటుకుని ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న
ఈ సందర్భంలోనే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో
పెద్ద ఎత్తున అభిమానులు చరణ్‌కి ఘనస్వాగతం పలికారు. ఇది ఆరంభం మాత్రమే.
మునుముందు మరిన్ని సంచలన విజయాల్ని ప్రేక్షకాభిమానులకు అందించేందుకు రామ్‌చరణ్
రెట్టించిన ఉత్సాహంతో సంసిద్ధమవుతున్నారు. ఇక నిర్మాతగానూ చరణ్ మరో సంచలనానికి
తెర తీసేందుకు ఎంతో సమయం లేదు. జనవరిలో సంక్రాంతి కానుకగా చరణ్ నిర్మించిన
‘ఖైదీ నంబర్ 150’ రిలీజవుతోంది. బాస్ ఈజ్ బ్యాక్. ఇటీవలే లాంచ్ చేసిన టీజర్‌తోనే
సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. టీజర్‌లో మెగాస్టార్ చిరంజీవి చూపించిన గ్రేస్, ఎనర్జీ లెవల్స్‌కి
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఖుషీ అయిపోయారు. సంక్రాంతికి మరో సంచలన
విజయం సాధించేందుకు మెగాస్టార్‌తో కలిసి నిర్మాతగా చరణ్ సిద్ధమవుతున్నారు.