లాక్‌డౌన్ నేపద్యంలో సెలబ్రెటీలకు కావాల్సినంత సమయం దొరికింది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంతమంది ఇంటిపనులతో ఆడవాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటుంటే… మరికొందరు… వంటింట్లోకి వెళ్లి నచ్చిన వంటకాలు చేసి కుటుంబసభ్యులకు రుచి చూపిస్తున్నారు. తాజాగా హీరో రామ్‌చరణ్ కూడా కిచెన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వంటింట్లో చొరబడి వంట చేశాడు. తాజాగా వంటింట్లోకి వెళ్లి తన తల్లి, నాన్నమ్మ నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. కాగా ఇప్పటికే రామ్ చరణ్ ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.