HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌: కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌: కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్

Ram Charan Birthday specialమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు(మార్చి 27) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఆయన అభిమానులు సిద్ధమైయ్యారు. ఇప్పటికే చరణ్ కోసం ఈ మధ్య ట్రెండ్ గా మారిన కామన్ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని క్రియేట్ చేశారు. దీనిని టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలతో విడుదల చేయించారు. ‘రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం’ ఈ ఏడాది మరింత స్పెషల్ గా చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో కామన్ మోషన్ పోస్టర్ ని డిజైన్ చేయించారు.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ స్పెషల్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చరణ్ అన్న బర్త్ డే కానుకగా క్రియేట్ చేసిన ఈ యానిమేషన్ మోషన్ పోస్టర్ సూపర్బ్ గా ఉందని పేర్కొన్నారు. ఇందులో మంటల మధ్యలో రామ్ చరణ్ గుర్రంపై నుంచి వచ్చి జంప్ చేయగా.. ‘హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ అని టైటిల్స్ వచ్చేలా చూపించారు. దీనికి ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ బ్యాగ్రౌండ్ స్కోర్ ని జత చేశారు. సీడీపీ కి నెగిటివ్ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ మోషన్ పోస్టర్ కి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu