HomeTelugu Trendingహాలీవుడ్‌ డైరెక్టర్స్‌కి కూడా కండీషన్ పెడతాను: రామ్‌ చరణ్‌

హాలీవుడ్‌ డైరెక్టర్స్‌కి కూడా కండీషన్ పెడతాను: రామ్‌ చరణ్‌

ram charan 1

‘RRR’ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు రామ్ చరణ్. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తర్వాత ఇండియా నుంచి గ్లోబల్ గుర్తింపు చరణ్ కి మాత్రమే దక్కింది. తాజాగా చరణ్ కశ్మీర్ లో జరుగుతోన్న జీ-20 సదస్సకు ఇండియన్ స్టార్ హోదాలో హాజరయ్యారు. వైట్‌ డ్రస్‌లో రామ్‌ చరణ్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇక రామ్‌చరణ్‌ ఈ సదస్సులో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరవిషయాలు పంచుకున్నారు.

`ఇండియాలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయి. కశ్మీర్ లో ఈ సదస్సు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. కేరళ..కశ్మీర్ లాంటి ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి ఎంతో బాగుంటుంది. షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ప్రదేశాలివన్ని. నా సినిమాల ద్వారా వీటిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. అందుకే నేను నటించే సినిమాలు ఎక్కువగా ఇండియాలోనే షూటింగ్ జరగాలని కోరుకుంటున్నా అని రామ్‌ చరణ్‌ అన్నారు.

ఇకపై కేవలం లొకేషన్లు కోసం ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా. నేను హాలీవుడ్ సినిమాల్లో నటించినా అక్కడ దర్శకులకు ఇండియా అందాలు చూపిస్తాను. ఇక్కడ కూడా షూటింగ్ చేయాలని కండీషన్ పెడతాను. నార్త్..సౌత్ అని రెండు రకాల సినిమాలు లేవు. ఉన్నది ఒక్కటే సినిమా అది… భారతీయ సినిమా. ఇప్పుడు మన సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది.

`ఆర్ ఆర్ ఆర్` సినిమాతో జపాన్ ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యాం. అక్కడి ప్రజలు ఎంతో ఆత్మీయంగా ఉంటారు. జపాన్ అంటే ఉపాసనకి ఎంతో ఇష్టం. ఇప్పుడామె ఏడు నెలల గర్భిణి. ఇప్పుడు జపాన్ వెళ్దామన్నా! రెడీ అంటుంది. చిన్నప్పుడు నాన్న గారితో కలిసి సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లాను. అప్పటి నుంచి ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చాను. నాన్న గారికి ఇప్పుడు 68 ఏళ్లు.

ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంత పెద్ద హీరో అయినా ఇప్పటీకి ఉదయం 5.30 గంటలకు నిద్ద లేస్తారు. ఆయనకి సినిమాలపై అంతటి నిబద్దత ఉంటుంది. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనే నాకు స్పూర్తి` అని అన్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu