మెగా ప్రిన్స్ నిహారిక పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రీ వెడ్డింగ్ మొదలుకొని ప్రతి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో నిహారిక పెళ్లిపీటలు ఎక్కనుంది. డిసెంబర్ 9 జొన్నలగడ్డ చైతన్య, నిహారిక మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరగనుంది. పెళ్లిసమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నిహారిక, చైతన్య ఫ్యామిలీలు ప్రత్యేక ప్లైట్ ఉదయ్‌పూర్ చేరుకోగా… తాజాగా రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనతో పాటు అల్లు అర్జున్ కుటుంబం ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా బంధువులు, అతికొద్దిమంది ప్రముఖులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. అయితే హైదరాబాద్‌లో నిర్వహించే రిసెప్షన్‌కు మాత్రం కొందరు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram