Chiranjeevi: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి, వెంకయ్య నాయుడు ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చిరంజీవి, వెంకయ్య నాయుడులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై పాన్ ఇండియా హీరో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సినీ పరిశ్రమకు మీరందించిన సేవలు నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. చిరంజీవి సేవలను గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అంటూ రామ్ చరణ్ రాసుకోచ్చాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ‘దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ అచీవ్‌మెంట్ ను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు.