మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో రామ్ చరణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా చరణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్రంను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చరణ్ చేశాడు. ఆ సినిమా సమయంలోనే మైత్రి మూవీస్ లో మళ్లీ సినిమా చేస్తానంటూ చరణ్ హామీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అంతా కుదిరితే ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ లో నటించే అవకాశాలు ఉన్నాయి.