హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు అత్యంత ఇష్టమైంది ఏంటంటే బహుశా ఫిట్‌నెస్ అనే సమాధానమే రావొచ్చు. ఇక్కడ ఆమె చేస్తున్న యోగా విన్యాసాలు చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. తను నటించబోయే తదుపరి బాలీవుడ్ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల మోతాదు ఎక్కువగా ఉంటుందట. అందులో రకుల్ వాటా ఎక్కువగానే ఉండటంతో దేహదారుఢ్యంపై మరింత దృష్టిపెట్టింది. అందుకే ఇలా ఏరియల్ యోగా సాధనలో మునిగి తేలుతోంది. ‘ఏరియల్ యోగా చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. నేను ఎందుకోసం ఇంతలా కష్టపడుతున్నానో నా తర్వాత బాలీవుడ్ చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది’ అని చెబుతోంది రకుల్. ఆమె ఏరియల్ యోగా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తను ఫిట్‌గా ఉంటే సరిపోదు, అందరూ ఉండాలనే ఉద్దేశంతో జిమ్‌లు కూడా నిర్వహిస్తోందామె.