కొత్త సంవత్సరంలో ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నది. బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో 2024లో ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్. 2021లో తన ప్రియుడ్ని అందరికీ పరిచయం చేసింది రకుల్. వీరి గత మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు.
2024 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. ఈ ఫిబ్రవరి 22న గోవా వేదికగా భగ్నానీ- రకుల్ ప్రీత్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.
త్వరలోనే దీనికి అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గోవాలో వీరి పెళ్లి వేదికగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకాబోతున్నట్లు సమాచారం.
ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ సినిమాతో మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేస్తోంది.