హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన రకుల్.. విమానాలు రద్దవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ‘ముంబయి ఎయిర్పోర్ట్ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?’ అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబయి పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు రకుల్ స్పందిస్తూ.. ‘సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా ఎయిర్పోర్ట్ నుంచి కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయాను’ అని సమాధానమిచ్చారు. భారీ వర్షాల కారణంగా అనేక విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ నెల ఐదో తేదీ వరకు ముంబయిలో అతిభారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Can anyone tell me if the airport is open? @mybmc @MumbaiPolice @BOMairport
— Sonam K Ahuja (@sonamakapoor) July 2, 2019