రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ధృవ’ సినిమాలో హీరోయిన్
గా నటించి మెప్పించింది రకుల్. ఈ సినిమాలో గ్లామర్ పరంగా రకుల్ కి మంచి మార్కులే
పడ్డాయి. ఈ సంధర్భంగా రకుల్ తో కొన్ని ముచ్చట్లు..
కథే ముఖ్యం..
నేను తెలుగు, తమిళ సినిమాలు అన్నీ చూస్తుంటాను. ‘తని ఒరువన్’ సినిమా చూసేప్పుడు
నాకు బాగా నచ్చింది. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయడం ఆ అవకాశం నాకు రావడం
ఆనందంగా అనిపించింది. నేను సినిమాను సినిమాగా చూస్తాను. రీమేక్ అనే విషయాలను
పెద్దగా పట్టించుకోను. నాకు కథే ముఖ్యం.
కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి..
ఇప్పటికే చరణ్ తో బ్రూస్ లీ, సురేందర్ రెడ్డి గారితో కిక్2 సినిమాలకు పని చేశాను. కాబట్టి
వల్ల స్టయిల్ ఆఫ్ వర్కింగ్ గురించి నాకు తెలుసు. కనుక రెండోసారి నటించేప్పుడు కంఫర్ట్
లెవెల్స్ బెటర్ గా ఉంటాయి. అప్పుడు ఔట్ పుట్ కూడా బాగా వస్తుంది.
నా అచ్చేవ్మెంట్ గా భావిస్తున్నా..
బ్రూస్ లీ సినిమా అంత వర్కవుట్ కాకపోయినా.. చరణ్ తో మళ్ళీ ఛాన్స్ రావడం మొదట
వింతగా అనిపించింది. హిట్ పెయిర్ అనుకొని నటించే వారి సినిమాలు కూడా ఫెయిల్ అయిన సంధర్భాలు
చాలానే ఉన్నాయి. ఒకసారి ఫ్లాప్ వచ్చినప్పటికీ మళ్ళీ నన్నే సెలెక్ట్ చేయడం నా అచ్చీవ్మెంట్
అనుకుంటున్నాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది.
ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్ డం కాదు..
ఈరోజు నేను స్టార్ హీరోయిన్ వెలుగొందుతున్నాను అంటే అది ఒక్క రాత్రిలో వచ్చిన స్టార్ డం
కాదు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాను. తెలుగు వారు నన్ను ఆదరిస్తుండడం సంతోషంగా ఉంది.
సింపుల్ గా ఉంటా..
ఒక్కసారి షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత దాన్ని నుండి డిస్కనెక్ట్ అయిపోతాను. సింపుల్
గా అందరిలా ఉండడానికి ఇష్టపడతాను.
నటించడమంటే ఇష్టం..
నేను నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను. గ్లామర్, పెర్ఫార్మన్స్ అని సెపరేట్ చేయలేను.
ఆయనతో కలిసి వర్క్ చేయడం నా డ్రీమ్..
రాజమౌళి గారి సినిమా అంటే వెంటనే రెడీ అయిపోతాను.. అది నా డ్రీమ్ అనే చెప్పొచ్చు.
అందరికీ గుర్తుండే పాత్ర అది..
ప్రేక్షకులు నన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో
అనుకుంటున్నాను. చైతుతో చేస్తోన్న సినిమాతో ఆ కల నెరవేరబోతోందనే చెప్పాలి. నా
పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది.
లవ్ స్టోరీస్ చాలా ఇష్టం..
నాకు ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆషికీ, ఓకే బంగారం ఇలాంటి తరహా
సినిమాల్లో నటించాలనుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
మహేష్ బాబు, సాయి ధరం తేజ్, నాగచైతన్య, బోయపాటి శ్రీను ఇలా తెలుగులో నాలుగు
సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలానే తమిళంలో కార్తీ హీరోగా చేస్తోన్న సినిమా ఓకే చేశాను.
న్యూ ఇయర్ ప్లాన్ చేస్తోన్నా..
గత నాలుగు సంవత్సరాలుగా న్యూ ఇయర్ కి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. కానీ
షూటింగ్స్ వలన కుదిరేది కాదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
మొత్తం పాతిక మంది స్నేహితులతో కలిసి వెళ్తున్నాను.