వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇక కొద్దిరోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన కూడా చేసింది. నాలుగేళ్లుగా రాత్రిపగలు తేడా తెలియకుండా పని చేస్తూనే ఉన్నాను. 10 సినిమాలు విరామం తీసుకోకుండా నటించాను. కాబట్టి ఈ ఏడాది చివర్లో బ్రేక్ తీసుకోవాలని ముందే అనుకున్నాను. కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఆమెకు ఫ్లాపులు
వస్తుండడంతో పాత్రల విషయంలో సరైన ఎంపిక లేదంటూ విమర్శలొస్తున్నాయి.
ఈ క్రమంలో ఆమె సినిమాల ఎంపిక విషయంలో తొందర ఏం పడడంలేదని అంటోంది. మనసుకు నచ్చిన కథలను మాత్రం ఎన్నుకుంటున్నానని ఒకేసారి మూడు, నాలుగు స్టోరీలు నచ్చితే అన్నీ చేయాలనుకుంటానని వెల్లడించింది. అయితే ఆమె తల్లితండ్రులు మాత్రం బ్రేక్ తీసుకోమని చెప్పారట. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవు. అయితే రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించింది.