టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడినట్లు స్వయంగా ఆమే వెల్లడించింది. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని రకుల్ తెలిపింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది రకుల్.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020