బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాతి పరిణామాలు బాలీవుడ్ సహా సౌతిండియాలో సినీ వర్గాలను గడగడలాడిస్తున్నాయి. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. ఎన్‌సీబీ విచారణలో భాగంగా రియా కొందరు బాలీవుడ్ నటుల పేర్లు బయటపెట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్లే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సారా అలీఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమన్ కంబట్టా, సుషాంత్ ఫ్రెండ్, మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్, ఫిలిం మేకర్ ముఖేష్ ఛబ్రాపై డ్రగ్స్ వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్‌కు రియాకు మధ్య మంచి స్నేహం ఉందని ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్న ఈ తరుణంలో డ్రగ్స్ రాకెట్‌లో రకుల్ పేరు బయటపడటంతో హాట్ టాపిక్ కావడమే కాకుండా జనాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.