డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. గతంలో ఇదే కేసులో తనపై వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలంటూ రకుల్ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. మీడియా ద్వేషపూరిత ప్రచారాలను అమలు చేయలేదని ప్రోగ్రామ్ కోడ్ మరియు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను పిటీషన్ లో పేర్కొంది. తాజాగా రకుల్ మరోసారి ముంబై లోని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని పిటీషన్ లో పేర్కొంది. మీడియా కథనాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసు దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత కోర్టు ముందు నివేదికను దాఖలు చేసే వరకు మీడియా కథనాలను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరింది రకుల్.