హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా నేపథ్యంలోనే రకుల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన సినిమా నిర్మాతలకు తనవంతు సాయం అందించాలని అనుకుందట. దానితో రాబోయే సినిమాలకు సగం పారితోషికం మాత్రమే తీసుకోబోతుందట ఈ బ్యూటీ. అంటే, తన రెమ్యునరేషన్‌లో 50 శాతం కోత విధించుకుంటున్నారట. తన పారితోషికంలో కోత గురించి రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ వర్గాల ద్వారా విషయం బయటికి వచ్చింది. నిర్మాతలు కోలుకోవాలంటే నటీనటులు తమ పారితోషికాల్లో కోత విధుంచుకోక తప్పదని భావించిన ఈ బ్యూటీ.. అందుకోసమే తన రెమ్యునరేషన్‌ను 50 శాతం తగ్గించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్, తాప్సీ లు కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరింది రకుల్. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈసినిమాకు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పిన రకుల్ ఇప్పుడు రాబోయే సినిమాలకు సగం రెమ్యూనరేషన్ తగ్గించుకుందని సమాచారం.