HomeTelugu Trendingతన డ్రెస్‌పై కామెంట్‌ చేసిన నెటిజన్‌పై రకుల్‌ ఆగ్రహం.. వైరల్!

తన డ్రెస్‌పై కామెంట్‌ చేసిన నెటిజన్‌పై రకుల్‌ ఆగ్రహం.. వైరల్!

3 18అదమడహీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ వేసుకునే దుస్తులపై ఆమె జీవనశైలిపై భగత్‌ అనే నెటిజన్‌ ఆమెను ట్యాగ్‌ చేస్తూ అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రకుల్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘మీ అమ్మ నీకు ఇలాంటివే నేర్పిస్తున్నారా? అదే విధంగా కొన్ని మంచి విషయాలు కూడా నేర్పించమని అడుగు. నీలాంటి వాళ్లు ఉన్నంతవరకు ఆడవాళ్లకు రక్షణే ఉండదు. సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టినంతమాత్రాన సరిపోదు’ అని ట్వీట్‌ చేసి అతని నోరుమూయించారు.

రకుల్‌ పెట్టిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్‌ చేసిన కామెంట్లకు అతని తల్లిని అనడం సబబు కాదని, ఇలాంటి కామెంట్లకు సమాధానమిచ్చి మరింత దిగజారిపోయారంటూ చురకలంటిస్తున్నారు. వీటిపై రకుల్‌ స్పందిస్తూ.. ‘నా మాటతీరు, నైతిక విలువల గురించి ప్రశ్నిస్తున్నవారందరూ.. ఓ మహిళను పట్టుకుని అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఇలాంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నవారికి నా భాషలో బుద్ధి చెప్పాలనుకున్నాను. వారికి కూడా కుటుంబం ఉంటుందని, వారి ఇంట్లో వాళ్లను కామెంట్‌ చేస్తే నాలాగే ఫీలవుతారని చెప్పడానికే అలా స్పందించాల్సి వచ్చింది. భగత్‌ పెట్టిన కామెంట్‌కు అతని తల్లి చెంప చెళ్లుమనిపిస్తుందని ఆశిస్తున్నాను’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు రకుల్‌.

mos 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu