HomeTelugu Newsలాక్‌డౌన్‌ వేళ మందుల కోసం వచ్చిన రకుల్‌... వైరల్‌ వీడియో

లాక్‌డౌన్‌ వేళ మందుల కోసం వచ్చిన రకుల్‌… వైరల్‌ వీడియో

11 5
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి ఢిల్లీ రోడ్లపై కనిపించింది. అది చూసిన అభిమానులు ఆమెనా కాదా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మొహానికి మాస్క్ కట్టుకుని ఉన్న రకుల్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణ యువతిలా అలా వచ్చేసరికి ఎవరూ గుర్తు పట్టలేదు. గుర్తు పట్టేసరికి పని చూసుకుని వెళ్లిపోయింది రకుల్. ఓ మెడికల్ షాపుకి వచ్చి తనకు కావాల్సిన మందులను తీసుకుని వెళ్ళిపోయింది రకుల్. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రఫర్ ఈ వీడియోను షూట్ చేసాడు.

అతన్ని చూసిన వెంటనే వీడియో తీయొద్దంటూ వెళ్లిపోయింది రకుల్. ఆమె బయటికి వచ్చినపుడు కనీసం పక్కన కూడా ఎవరూ లేరు. ఒక్కతే అలా వచ్చేసి కావాల్సిన మెడిసిన్స్ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పటికే ఈమె తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వందలాది కుటుంబాలకు రోజూ రెండు పూటల భోజనం పెడుతున్నట్లు చెప్పింది. అలాగే సీసీసీకి విరాళం అందించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu