HomeTelugu Big StoriesRakul Preet Singh: రెండు సంప్రదాయల్లో..వైభవంగా రకుల్‌ పెళ్లి

Rakul Preet Singh: రెండు సంప్రదాయల్లో..వైభవంగా రకుల్‌ పెళ్లి

Rakul preet singh and jackk

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ఏడడుగులు వేసింది. గోవాలో ఈరోజు వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.

పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో రకుల్ – జాకీ వివాహం జరిగిందని తెలుస్తోంది. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావాల్సి ఉంది. వీరి పెళ్లి ఫొటోల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరి వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. తన ప్రేమ విషయాన్ని 2021లో రకుల్ బయటపెట్టింది. అప్పటి వీరికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తన భర్తతో కలిసి రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. 19వ తేదీనే మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే పార్టీలు, ఫంక్షన్లు గ్రాండ్‍గా చేసుకున్నారు. మంగళవారం సంగీత్ ఫంక్షన్ జరిగింది.

ఇక సినిమాల విషయానికి వస్తే… రకుల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తోంది. జాకీ విషయానికి వస్తే… ఆయన నిర్మించిన ‘బడే మియా చోటే మియా’ ఈ ఈద్ కు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu