HomeTelugu Trendingతమ్ముడు నా పెళ్లి ఫిక్స్‌ చేశావా.. నాకెందుకు చెప్పలేదు: రకుల్‌

తమ్ముడు నా పెళ్లి ఫిక్స్‌ చేశావా.. నాకెందుకు చెప్పలేదు: రకుల్‌

Rakul preet about his marri

రకుల్ ప్రీత్ ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్2’ లో మాత్రం నటిస్తోంది. ఆమె పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పెళ్లిపై ఈ ఇద్దరికీ సదభిప్రాయం ఉందన్నాడు. నెల, తేదీని ఇంకా ఫిక్స్‌ చేయలేదని చెప్పాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నిజమేనా? అని సోషల్ మీడియాలో రకుల్ ను ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై రకుల్ స్పందించింది. తన తమ్ముడు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన వార్తను షేర్ చేసిన ఆమె.. ‘నా పెళ్లి ఖరారు చేశావా అమన్? మరి, నాకెందుకు చెప్పలేదు తమ్ముడూ. ఏంటో.. నా జీవితం గురించిన వార్త నాకే తెలియకపోవడం ఫన్నీగా ఉంది’ అని రకుల్ ట్వీట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu