రకుల్ ప్రీత్ సింగ్ తాజా మూవీలో కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మరాఠీ దర్శకుడు తేజస్ డియోస్కర్ రూపొందిస్తున్నాడు. సోషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని RSV బ్యానర్లో రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఈ పాత్రకు రకుల్ కచ్చితంగా న్యాయం చేస్తుందని తనకు నమ్మకం ఉందంటున్నాడు దర్శకుడు తేజస్. ఈ సినిమాకు ఛత్రీవాలీ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ వినగానే రకుల్ ఓకే చెప్పిందట. మొదట ఈ కథను సారా అలీఖాన్, అనన్యపాండేకు వినిపించగా తిరస్కరించారట. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.