HomeTelugu Trendingమీడియా వేధిస్తోంది.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్

మీడియా వేధిస్తోంది.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్

Rakul preet singh approacheబాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్ లవర్‌ రియా చక్రవర్తి విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందని వార్తలు వినిపించాయి.

దీంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్‌ చేసిందని పిటిషన్‌లో వివరించారు. అంతేకాకుండా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు సైతం ఆదేశాలు ఇవ్వాలంటూ కోరింది. ఇక రకుల్‌ పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ న్యాయస్థానం.. కొంత ఊరట లభించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రకుల్‌పై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. రకుల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌ శుక్లా బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu