HomeTelugu Trendingకాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన రకుల్

కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన రకుల్

Rakul opens up on marriage

రకుల్ ప్రీత్ సింగ్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలకు జంటగా నటించింది. ఈ మధ్య రకుల్‌కు అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో అని చెప్పింది. రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉందని, తనకు కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలని చెప్పింది. తాను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చానని.. తన తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేయడంతో అదే వాతావరణంలోనే పెరిగానని తనకు క్రమశిక్షణ కొంత ఎక్కువ అని పేర్కోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే సంతోషిస్తానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తున్నానని అంతేకాదు బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది రకుల్.

మరోపక్క రకుల్ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్నానట్లు వస్తున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమాయణం గురించి వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్న సందర్భంలో.. ఈ వార్తలపై రకుల్ స్పందించింది‌. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు సంవత్సరాలు తన డేట్స్‌ ఖాళీలేవని చెప్పింది. వృత్తిపరంగా తీరిక లేకుండా గడుపుతున్నానని.. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది రకుల్. అంతేకాదు రెండేళ్ల తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అట్టహాసంగా వివాహ వేడుకను జరుపుకోవాలన్నది తనకు ఇష్టమని తెలిపింది. ప్రేమ వివాహంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే తానే స్వయంగా ఆ విషయాన్ని చెబుతానని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu