దగ్గుబాటి వారసుడు రానాకు టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ అనే పేరుంది. మనోడికి చాలా మంది హీరోయిన్లతో లింక్ ఉందంటూ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దానిపై రానా కూడా పెద్దగా స్పందించడు. త్రిషతో చాలా ఏళ్ల పాటు ఎఫైర్ నడిపాడంటూ చెన్నై మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా కోడై కూసింది. చివరికి ఆ కూసిన కోడి చచ్చిపోయింది కానీ రానా మాత్రం నవ్వుతూ సమాధానమిచ్చేవాడు.
తనపై వార్తలు రాసేవాళ్లకు అలుపొస్తుందేమో కానీ తనకు మాత్రం రాదంటూ సెటైర్ వేసాడు రానా. నేనెప్పటికీ మారను.. నన్ను చూసి వాళ్లే మారాలంటూ సమాధానమిచ్చాడు రానా. అలాంటి రానా దగ్గుబాటితో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎఫైర్ సాగిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలో రానా స్థాయిలో ఎఫైర్స్ మెయింటేన్ చేసిన హీరో మరొకరు టాలీవుడ్లో లేరని చెప్తుంటారు.. కానీ మనోడు మాత్రం చాలా కామ్‌గా.. కామన్‌గా తీసుకుంటాడు వీటిని. ఇప్పుడు రకుల్ వ్యవహారంపై కూడా రానా ఏం మాట్లాడటం లేదు. కానీ రకుల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.
ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో బిజినెస్‌తో పాటు ఇళ్లు కూడా కొనేసింది రకుల్. తనదిప్పుడు హైదరాబాద్.. నేను లోకల్ అనేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో రానాతో డేటింగ్ గురించి కూడా రకుల్ ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని.. సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. తనకు తెలుగులో మంచు లక్ష్మి, రానా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. వాళ్లే కాదు.. తమ బ్యాచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చింది రకుల్.
తనది, రానాది పక్క పక్క ఇల్లు కావడంతో అంతా తమ క్లోజ్‌నెస్ చూసి అలా అనుకుంటారు కానీ తనకు మాత్రం ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని.. ఇప్పటికీ సింగిల్ అంటూ సమాధానమిచ్చింది. దాంతో రకుల్, రానా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ వచ్చిందన్నమాట.