HomeTelugu Trendingవచ్చే ఏడాది రకుల్‌ పెళ్లి?

వచ్చే ఏడాది రకుల్‌ పెళ్లి?

Rakul marriage may be next

టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ రానా హోస్ట్‌గా చేస్తున్న నెం.1యారీ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ లైఫ్‌లోకి రకుల్‌ ఎంటర్‌ అయ్యాక అన్ని పద్దతులు మరిపోయాయని రానా చెప్పాడు. ముఖ్యంగా ఫుడ్‌ విషయంలో చాలా స్ర్టిక్‌ అయిపోయిందని, ఏం తినాలన్నా, పదిసార్లు ఆలోచిస్తుంటుందని, ఎక్కడికి అయినా వెళ్లినా రకులే ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుందని వివరించాడు.

రకుల్‌ పెళ్లి మేటర్‌ ప్రస్తావించగా.. ఈ ఏడాదిలోనే రకుల్‌ పెళ్లి ఉంటుందని మంచు లక్ష్మీ తెలిపింది. కాదు కాదంటూ రకుల్‌ వారించినా పెళ్లి ప్రయత్నాలు అయినా జరుగుతాయని, లేదా బాయ్‌ఫ్రెండ్‌ వస్తాడేమో అని లక్ష్మీ పేర్కొంది. ఇక వచ్చే అబ్బాయి ఎవరో తన వద్దకు వస్తే రకుల్‌ గురించి అన్ని విషయాలు చెప్పి పంపిస్తానని ఫన్నీగా బదులిచ్చింది. ఇక గతంలో రానా- రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించిన రకుల్‌.. తామిద్దం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu