మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని
తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ప్రతి సన్నివేశాన్ని రెండు బాషల్లో
చిత్రీకరించాలి. మహేష్ కు మొదటి నుండి తమిళ బాషపై పట్టు ఉండడంతో ఆయనకు ఎలాంటి
బాష సమస్య లేదు. అయితే రకుల్ కు మాత్రం సౌత్ బాషల పట్ల పెద్దగా అవగాహన లేదు.
ఇప్పుడిప్పుడే తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడడం నేర్చుకుంటోంది. ఈ నేపధ్యంలో
తమిళం కూడా నేర్చుకోవడం రకుల్ కు పెద్ద కష్టంగా మారిందని తెలుస్తోంది. డైలాగ్స్ విషయంలో
అమ్మడు చాలా కష్టపడుతోందట. షూటింగ్ ఉన్న రోజున తెల్లవారు జామునే లేచి ఆ రోజు
సీన్స్ కు సంబంధించిన డైలాగ్స్ అన్నీ బట్టి పడుతోందట. ఇలా బట్టి పట్టి డైలాగ్స్ చెబుతుంటే
అమ్మడు బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన రోజులు గుర్తువస్తున్నాయని చెబుతోంది.