ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం దక్కిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇందులో కాజల్ అగర్వా్ల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమె కాకుండా ఇప్పటికే మరో ఇద్దరు నటీమణులను కీలక పాత్రల కోసం ఎంపికచేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారితో పాటు రకుల్ కూడా ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రకుల్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం కమల్ ‘బిగ్‌బాస్ 3’ తో బిజీగా ఉండటంతో సినిమా చిత్రీకరణ ఆలస్యంగా జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాష్‌కరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. రకుల్ హీరోయిన్‌గా నటించిన ‘మన్మథుడు 2’ సినిమా ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.