దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మరింత విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఇన్‌సైడర్, ఔట్ సైడర్ అనే దానిపైనే అందరూ చర్చిస్తున్నారు. బంధుప్రీతి, ఫేవరిటిజం, గ్రూపిజం ఇలాంటి వాటిపైనే అందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ కూడా దీనిపై స్పందించింది. ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారంటూ కామెంట్ చేసింది. కెరీర్‌లో ఎదురుదెబ్బ తగిలినప్పుడు మరింత కష్టపడి తట్టుకుని నిలబడాలని అంటోంది. మన టాలెంట్ మనకు విజయాన్ని తెచ్చిపెడుతుందని అంటోంది. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేమని, అయితే కష్టపడే మనస్తత్వం, మన వృత్తిపట్ల శ్రద్ధ మనకు అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కోవాలని అంటోంది. ప్రస్తుతం ఇండియన్-2లో కమల్ సరసన నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది బాలీవుడ్‌లో దేదే ప్యార్ సినిమాతో తొలి విజయం అందుకుంది.