సౌత్‌తో పాటు నార్త్‌లోనూ కథానాయికగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది రకుల్‌ప్రీత్ సింగ్. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ఆమె బాలీవుడ్‌లో తొలి మెట్టు ఎక్కేసింది. హిందీలో హీరో అజయ్ దేవగన్‌కు జంటగా “దే దే ప్యార్ దే” సినిమాలో రకుల్ నటించింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.44.73 కోట్లు రాబట్టింది.
మరోపక్క కోలీవుడ్‌లో సూర్య సరసన రకుల్ ఎన్జీకే సినిమాలో నటించింది. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న మన్మథుడు 2 లో ఆమె కథానాయిక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు. ‘దే దే ప్యార్ దే’ సినిమాకు మంచి స్పందన అందిన నేపథ్యంలో ట్విటర్ వేదికగా నెటిజన్లతో రకుల్ ముచ్చటించింది.
రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వస్తే వెంటనే సంతకం చేసేస్తానని అంది. ఇప్పటి వరకు తనకు ప్రపోజ్ చేసిన వాళ్లు ఒక్కరు కూడా లేరని రకుల్ అంటోంది. స్నేహితులు ఉన్న ఏ ప్రదేశమైనా తనకు ఇష్టమేనని.. వెళ్లే చోటుకన్నా తనతో ఉండే మనుషులు ఎవరన్నదే ముఖ్యంమని తెలిపింది. అలాగే తనకు సమంత అంటే ఇష్టమని సమంత పవర్ ఉమన్ అని కొనియాడింది. తనకు ఇష్టమైనది నటన అని తెలిపింది. సరైన కథ వస్తే మరోసారి సూర్యతో చేస్తానని అంది. లండన్ టూర్‌కి వెళ్లడం ఇష్టమని సంతోషంగా ఉండటమే తన అందానికి కారణమని తెలిపింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం తల్లిదండ్రులనుంచి వచ్చిందని తెలిపింది. తాను ఒత్తిడిలో ఉన్న సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతానని అంది.