టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే డైరెకర్ట పూరీ జగన్నాథ్, ఛార్మిలను విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఉదయం 10:30 కి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా..9:10కే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.
నిజానికి సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(సెప్టెంబర్3)న విచారణకు హాజరవుతానని రకుల్.. ఈడీకి మెయిల్ ద్వారా తెలిపింది. దీంతో డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులో పేర్కొంది. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.